గ్రామ వికాస్ – రాయదుర్గ

ఆనంతపూర్ అనంతపురం జిల్లాలో మోడల్ గ్రామాలు తయారు చేసేందుకు గ్రామ వికాస్ కృషి చేస్తుంది గత ఆరు సంవత్సరాలుగా గ్రామాలలో సంస్కార కేంద్రాలు మరియు గ్రామంలో జట్టు ద్వారా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహణ చేసి గ్రామంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది దాదాపు 25 గ్రామాలలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి 35 మంది కి పైగా విద్యార్థులను తీసుకొని వారికి ప్రతిరోజు రెండు గంటలు సంస్కార కేంద్రాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ రెండు గంటలలో ఒకటిన్నర గంట విద్యకు అంటే హోంవర్క్ చేయించడం, సబ్జెక్టు చెప్పడం, డౌట్స్ క్లియర్ చేయడం అరగంట సంస్కారానికి సంబంధించిన విషయాలు నేర్పించడం జరుగుతుంది. శనివారం రోజు బాలగోకులం పేరుతోటి రెండు గంటలు సంస్కారానికి సంబంధించిన విషయాలు నిర్వహణ జరుగుతుంది. ఇందులో ప్రార్థన ,దేశభక్తి గీత్, సుభాషితం, అమృత వచనం, కోలాటం, నృత్య భజన, అభినయ గేయం, పద్యం, భగవద్గీత శ్లోకాలు, నిత్య శ్లోకాలు, సూర్య నమస్కారాలు, వ్యాయామాలు, ఆటలు ఇలా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులలో శారీరక దృఢత్వం, మానసిక వికాసం, మరియు నైతిక విలువలు నేర్పించడం జరుగుతుంది. సంస్కార కేంద్రాల్లో అనేక రకాల ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు చేత సీడ్ బాల్స్ తయారు చేయించడం, రక్షాబంధన్, విహారయాత్ర, మట్టి గణపతి తయారీ, స్వామి వివేకానంద జయంతి, సంక్రాంతి, ఉగాది, యోగ డే, శ్రీరామనవమి, వనవాసి నిధి, సూర్య నమస్కార యజ్ఞం, భారతమాత పూజా దినోత్సవం, సంస్కార కేంద్ర వార్షికోత్సవం, విహారయాత్ర లాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు మరియు గ్రామస్తులలో మంచి గుణాలు నిర్మాణం చేయడం కోసం గ్రామ వికాస్ పని చేస్తుంది, ఇవే కాకుండా మాతృమూర్తులకు మాతృమండలి నిర్వహించడం అలాగే తల్లితండ్రుల మరియు పిల్లల సంబంధాలు బాగా ఉండటం కోసం మాతా పితృ పూజా కార్యక్రమాలు మరియు సమరసత లో భాగంగా అన్ని కులాలు కలిసి సామూహికంగా దీప పూజా కార్యక్రమాలు మరియు రైతులకు సంబంధించి భూమి సుపోషణ కార్యక్రమం ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు. సంవత్సరంలో ఒకసారి బాల సంగమం జరుపుతున్నాము. గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు మాతృమూర్తులు మరియు పెద్దలు అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల నెమ్మది నెమ్మదిగా గ్రామంలో మార్పు జరగడం జరుగుతుంది. సంస్కార కేంద్రం నిర్వహణ చేయడం వల్ల తల్లితండ్రులు కొంత మార్పు వచ్చింది మరియు గ్రామాల్లో అందరికీ దేవాలయ ప్రవేశం జరిగే పరిస్థితిని నిర్మాణం చేయడం జరుగుతున్నది. మన చేస్తున్నటువంటి పనికి గ్రామంలోని పెద్దలందరూ కూడా సహకరిస్తూ మార్పును స్వాగతిస్తున్నారు