“ఆరోగ్య మిత్ర” సేవా భారతి – అరకు

గిరిజన ప్రాంతాలు అయిన విశాఖపట్నం జిల్లాలోని అరకు పాడేరు ప్రాంతాలలో ప్రజలు వైద్యానికి చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన స్థానిక సేవా భారతి కార్యకర్తలు 2015 లో వైద్య సేవలు ప్రారంభించారు.. అందులో భాగంగా ఆరోగ్య మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2015 సెప్టెంబర్ మాసంలో అరకు ఏజెన్సీ పాడేరు ప్రాంతాలలోని ఎంపికచేసిన యువతీ యువకులు ఇరవై ముగ్గురు సభ్యులకు వైద్య విధానంలో శిక్షణ ఇచ్చారు . కాలిన, తెగిన ,కోసుకున్న గాయాలకు వైద్యం చేయటం తో పాటు వాంతులు, విరోచనాలు, చిన్న చిన్న వైద్య పరమైన ఇబ్బందులకు  హోమియో వైద్యం, ఆయుర్వేద వైద్యం, ఇంగ్లీషు వైద్యం ద్వారా  ఆరోగ్య మిత్ర వైద్య సేవ విభాగం  వారు 2015 నుండి 130 గ్రామాలలో వైద్య సేవలు అందిస్తున్నారు ప్రతి నెలలో మొదటి ఆదివారం ఆరోగ్య మిత్ర బృందానికి వైద్యం మెలుకువల పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.