Aswani Sanchara Vaidyasala – Bapatla

గుంటూరు జిల్లా బాపట్ల కేంద్రముగా చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలలో వైద్య సేవలు అందించుటకు కాను 2004 సంవత్సరములో అశ్విని సంచార వైద్యశాల ప్రారంభించటమయినది. ఈ ప్రకల్పాన్ని మండవ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ప్రారంభించటమయినది . బాపట్ల పరిసర ప్రాంతాలలో 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 48 గ్రామాలలో ఈ సంచార వైద్యశాల నిరుపేద లకి సేవలందిస్తున్నది . దీనిలో ఒక వైద్య అధికారి ఒక హెల్పర్ ఉంటారు ప్రతిరోజు రెండు గ్రామాలను సందర్శిస్తూ నెలలో 24 రోజులు ఈ సంచార వైద్యశాల 14 సంవత్సరాలుగా నిరంతరాయముగా పని చేయుచున్నది .బాపట్లకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందోలు గ్రామము వద్ద కల టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేయుచున్న కార్మికులకు సేవలు వారంలో ఒకరోజు అందించుచున్నది.